Vizianagaram: విజయనగరం జిల్లాలో దారుణం.. ప్రత్యేక శిక్షణ పేరుతో బాలికను గర్భవతిని చేసిన ట్యూషన్ మాస్టారు!

Tution teacher raped 10th class girl student in vizianagaram
  • మేధాశక్తిని పెంచేందుకు ప్రత్యేక శిక్షణ పేరుతో లోబర్చుకున్న నిందితుడు
  • ఇది వరకు అక్క కుమార్తెతో వివాహం
  • కుమార్తెకు 8వ నెల గర్భం అని తెలిసి తల్లిదండ్రుల షాక్
విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో దారుణం జరిగింది. ట్యూషన్ కోసం తన వద్దకు వచ్చే బాలికను ప్రత్యేక శిక్షణ పేరుతో గర్భవతిని చేశాడో ట్యూషన్ మాస్టర్. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక పదో తరగతి చదువుతోంది. గత మూడేళ్లుగా ఓ ట్యూషన్‌కు వెళ్తోంది. అక్కడి ట్యూషన్ టీచర్ చిన్నా బాలికపై కన్నేశాడు. మిగతా విద్యార్థులందరూ వెళ్లిపోయిన తర్వాత ప్రత్యేక క్లాసుల పేరుతో ఆమెను అక్కడే ఉంచేవాడు.

బాలికకు తెలివి లేదని, మేధాశక్తిని పెంచేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సి ఉందని చెబుతూ ఆమెను లోబర్చుకున్నాడు. బాలిక కొన్ని రోజులుగా ముభావంగా ఉండడం, సరిగా తినకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు బాలిక ఎనిమిదో నెల గర్భవతి అని చెప్పడంతో తల్లిదండ్రులు షాకయ్యారు.

ఆ వెంటనే దిశ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు పంపారు. నిందితుడికి ఇప్పటికే తన అక్క కుమార్తెతో వివాహం జరిగిందని, ఉద్యోగం రాకపోవడంతో ట్యూషన్లు చెప్పుకుంటున్నాడని పోలీసులు తెలిపారు.
Vizianagaram
Gantyada
Student
Rape
Tution Teacher

More Telugu News