నిత్యావసరాల సరఫరా సేవలను నిలిపివేస్తున్న జొమాటో
- ఈ సేవల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడం ఇది రెండోసారి
- ఆర్డర్లు వస్తున్నంత వేగంగా సరుకులు అందించలేకపోతుండడమే కారణం
- నిత్యావసరాల సరఫరా సంస్థ గ్రోఫర్స్‌లో రూ. 745 కోట్ల పెట్టుబడి
ఈ క్రమంలో ఆర్డర్లు వస్తున్నంత వేగంగా సరుకులు అందించలేకపోతుండడంతో అప్పట్లోనే ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఎంపిక చేసిన నగరాల్లో మాత్రం ముప్పావుగంటలోపే నిత్యావసర సరుకులు అందిస్తామంటూ ఈ ఏడాది జులైలో మళ్లీ ప్రకటించింది. ఇప్పుడు మరోమారు ఆ సేవల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడం గమనార్హం. కాగా, నిత్యావసరాల సరఫరా సంస్థ గ్రోఫర్స్‌లో జొమాటో దాదాపు రూ. 745 కోట్ల పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే.