Rajanikanth: 'అన్నాత్తే' నుంచి రేపు రజనీ ఫస్టులుక్!

  • రేపు ఉదయం 11 గంటలకు ఫస్టులుక్
  • రేపు సాయంత్రం 6 గంటలకు మోషన్ పోస్టర్
  • రజనీ సరసన ముగ్గురు సీనియర్ హీరోయిన్లు  
  • నవంబర్ 4వ తేదీన సినిమా రిలీజ్  
Annaatthe first look will release tomorrow

రజనీకాంత్ కథానాయకుడిగా సన్ పిక్చర్స్ బ్యానర్ పై 'అన్నాత్తే' సినిమా రూపొందింది. శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజనీ కొత్త లుక్ తో కనిపించనున్నాడు. 'వినాయక చవితి' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను .. మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు.

రేపు ఉదయం 11 గంటలకు ఫస్టులుక్ పోస్టర్ ను .. రేపు సాయంత్రం 6 గంటలకు మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఒక స్పెషల్ పోస్టర్ ను వదిలారు. అంటే రేపు రజనీ అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యే రోజనే చెప్పాలి.

ఈ సినిమాలో ఖుష్బూ .. మీనా .. నయనతార .. కీర్తి సురేశ్ కీలకమైన పాత్రలను పోషించారు. ఒక్క కీర్తి సురేశ్ మినహా మిగతా వాళ్లంతా గతంలో రజనీ జోడీగా హిట్లు అందుకున్నవారే. దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రజనీ చేసిన ఈ ప్రయోగం మరో సంచలనానికి తెరతీస్తుందేమో చూడాలి.

More Telugu News