ఆసక్తిని రేపుతున్న 'రాజా విక్రమార్క' టీజర్!
- యాక్షన్ ఎంటర్టైనర్ గా 'రాజా విక్రమార్క'
- కార్తికేయ జోడీగా తాన్య హోప్
- కీలక పాత్రలో సాయికుమార్
- త్వరలో విడుదల తేదీ ప్రకటన
వరుణ్ తేజ్ చేతుల మీదుగా కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయించారు. టీజర్ అంతా కూడా తనికెళ్ల భరణి - కార్తికేయ పాత్రలపై కట్ చేశారు. కంటెంట్ కి తగినట్టుగానే యాక్షన్ ఎపిసోడ్స్ పుష్కలంగా ఉన్నాయనిపిస్తోంది.
కార్తికేయ పాత్రకి యాక్షన్ తో పాటు కామెడీ టచ్ కూడా ఇచ్చినట్టుగా అర్థమవుతోంది. కీలకమైన పాత్రలో సాయికుమార్ కనిపిస్తున్నాడు.