Nagachaitanya: 'లవ్ స్టోరీ' రిలీజ్ అందుకే వెనక్కి వెళ్లిందట!

  • శేఖర్ కమ్ముల నుంచి మరో ప్రేమకథ
  • చైతూ సరసన నాయికగా సాయిపల్లవి  
  • పవన్ సీహెచ్ సంగీతానికి మంచి ఆదరణ
  • త్వరలో కొత్త రిలీజ్ డేట్ ప్రకటన
Love Story movie update

నాగచైతన్య - సాయిపల్లవి జోడీగా గ్రామీణ నేపథ్యంలో 'లవ్ స్టోరీ' సినిమా నిర్మితమైంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా, కరోనా కారణంగా విడుదల విషయంలో వెనక్కి వెళుతూ వచ్చింది. ఇక ఇటీవల పరిస్థితులు అనుకూలంగా మారడంతో, 'వినాయకచవితి' కానుకగా ఈ నెల 10వ తేదీన విడుదల చేయాలనుకున్నారు.

కానీ హఠాత్తుగా ఈ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఆ రోజున థియేటర్లకు మరికొన్ని సినిమాలు క్యూ కట్టడంతోనే ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో ఒకటి రెండు సీన్స్ ను ఇంకా బెటర్ గా తీయవచ్చనే ఉద్దేశంతో శేఖర్ కమ్ముల ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు.

ఆ సీన్స్ రీ షూట్ కోసం ఈ సినిమా టీమ్ మళ్లీ నిజామాబాద్ వెళుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. రీ షూట్ పూర్తయిన తరువాతనే రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. పవన్ సీహెచ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, దేవయాని .. ఈశ్వరీరావు .. రావు రమేశ్ .. పోసాని ముఖ్యమైన పాత్రలను పోషించారు.  

More Telugu News