అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి హాలీవుడ్ సూపర్ స్టార్ కారు కొట్టేసిన దొంగలు
- మిషన్ ఇంపాజిబుల్-7లో నటిస్తున్న టామ్ క్రూజ్
- బ్రిటన్ లో షూటింగ్
- బర్మింగ్ హామ్ లో బసచేసిన క్రూజ్
- కారు హోటల్లో ఉంచి షూటింగ్ కు వెళ్లిన వైనం
బీఎండబ్ల్యూ ఎక్స్7 కారును తాళాలతో పనిలేకుండా ఇగ్నిషన్ ఫోబ్ సాయంతో ఇంజిన్ స్టార్ట్ చేయొచ్చు. అయితే ఇందుకోసం ప్రత్యేక సిగ్నల్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. దొంగలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇగ్నిషన్ ఫోబ్ సిగ్నల్ ను స్కానర్ సాయంతో క్లోన్ చేశారు. క్లోన్ చేసిన సిగ్నల్ సాయంతో ఇంజిన్ ను స్టార్ట్ చేసి ఎంచక్కా నడుపుకుంటూ వెళ్లిపోయారు.
అయితే, కారులో ఎలక్ట్రానిక్ ట్రాకింగ్ డివైస్ ఉండడంతో కారు ఎక్కడున్నది పోలీసులు వెంటనే గుర్తించారు. అప్పటికే దొంగలు కారులో ఉన్న నగదు, విలువైన వస్తువులతో ఉడాయించారు. కారును మాత్రం ఓ గ్రామం వద్ద వదిలేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.