Pooja Hegde: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • 'బీస్ట్' షెడ్యూలు పూర్తి చేసిన పూజ
  • యష్ కు కథ చెప్పిన బోయపాటి
  • ఓటీటీలో విజయ్ సేతుపతి సినిమా     
Pooja Hegde completes first schedule shoot of Beast

*  నేటి బిజీ అందాలతార పూజ హెగ్డే తొమ్మిదేళ్ల తర్వాత ఓ తమిళ చిత్రంలో నటిస్తోంది. విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'బీస్ట్' చిత్రంలో పూజ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం తొలిషెడ్యూలు షూటింగును ఈ చిన్నది నిన్న చెన్నైలో పూర్తిచేసుకుని, తిరిగి ముంబైకి వెళ్లిపోయింది.
*  ప్రస్తుతం బాలకృష్ణతో 'అఖండ' చిత్రాన్ని చేస్తున్న దర్శకుడు బోయపాటి శ్రీను తన తదుపరి చిత్రాన్ని 'కేజీఎఫ్' స్టార్ యష్ తో చేయనున్నాడు. ఈ క్రమంలో తాజాగా యష్ కు కథ చెప్పాడనీ, అది ఆయనకు బాగా నచ్చిందని అంటున్నారు.
*  విజయ్ సేతుపతి, తాప్సి జంటగా నటించిన తాజా చిత్రం 'అనబెల్ సేతుపతి'. దీపక్ సుందర్ రాజన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని థియేటర్లలో కాకుండా ఓటీటీ ద్వారా విడుదల చేస్తున్నారు. ఈ నెల 17న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డైరెక్టుగా స్ట్రీమింగ్ చేయడం ద్వారా దీనిని విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని నిన్న చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

More Telugu News