Ramcharan: 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ ముగియడంతో కార్లలో దూసుకెళ్లిన ఎన్టీఆర్, రామ్ చరణ్.. వీడియో ఇదిగో!

RRR shooting wraps up
షార్ట్స్‌లో చూడండి
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రూపుదిద్దుకుంటున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం నేటితో చిత్రీకరణ ముగించుకుంది. చిత్రబృందం ఇవాళ హైదరాబాద్ శివార్లలోని సెట్స్ లో గుమ్మడికాయ కొట్టేసింది. కాగా, చివరిరోజు షూటింగ్ కు హాజరైన ఎన్టీఆర్, రామ్ చరణ్... సన్నివేశాల చిత్రీకరణ పూర్తికాగానే రయ్యిమంటూ తమ కార్లతో దూసుకెళ్లారు. ఇటీవలే కొన్న లాంబోర్ఘిని ఉరుస్ కారులో ఎన్టీఆర్, స్పోర్ట్స్ కారులో రామ్ చరణ్ రోడ్డుపై సర్రుమంటూ వెళుతున్న వైనం వీడియోలో రికార్డయింది. సామాజిక మాధ్యమాల్లో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Go Back to Shorts
Ramcharan
Junior NTR
RRR
Shooting
Hyderabad

More Telugu News