Corona Virus: దేశంలో క‌రోనా కేసుల తాజా వివ‌రాలు

  • నిన్న 25,467 కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య  3,24,74,773
  • నిన్న 354 మంది మృతి
  • మృతుల సంఖ్య మొత్తం 4,35,110  
corona bulletin in inida

దేశంలో నిన్న 25,467 కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,24,74,773కు చేరింది. అలాగే నిన్న క‌రోనా నుంచి 39,486 మంది కోలుకున్నారు. నిన్న 354 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మొత్తం 4,35,110కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,17,20,112 మంది కోలుకున్నారు.    

3,19,551 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. అలాగే, దేశంలో నిన్న 63,85,298 వ్యాక్సిన్ డోసులు వేయగా, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 58,89,97,805 డోసుల వ్యాక్సిన్లు వేసినట్టు అధికారులు ప్ర‌క‌టించారు.        

More Telugu News