India: ఆఫ్ఘ‌నిస్థాన్ నుంచి 168 మందితో ఘ‌జియాబాద్ చేరుకున్న విమానం

indian flight reaches ghaziabad
షార్ట్స్‌లో చూడండి
ఆఫ్ఘనిస్థాన్ తాలిబ‌న్ల చేతుల్లోకి వెళ్లిన నేప‌థ్యంలో అక్క‌డ భార‌తీయుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం స్వ‌దేశానికి తీసుకొస్తోన్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా కాబూల్‌ నుంచి భారత వైమానిక దళానికి చెందిన ఓ విమానం ప్ర‌యాణికుల‌తో ఘ‌జియాబాద్ చేరుకుంది.

ఆ విమానంలో 107 మంది భార‌తీయులు స‌హా మొత్తం 168 మంది ఉన్నారు. హిండ‌న్ వైమానిక స్థావ‌రంలో ఆ విమానం దిగింది. అక్క‌డి నుంచి భార‌తీయులు త‌మ సొంత ప్రాంతాల‌కు వెళ్ల‌నున్నారు. ఇప్ప‌టికే ఆఫ్ఘ‌నిస్థాన్ నుంచి భార‌త్ ప‌లు ద‌శ‌ల్లో భార‌తీయుల‌ను స్వ‌దేశానికి తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే.


Go Back to Shorts
India
Afghanistan

More Telugu News