Corona Virus: దేశంలో 151 రోజుల క‌నిష్ఠ‌ స్థాయికి యాక్టివ్ కేసులు

corona bulletin in inida
షార్ట్స్‌లో చూడండి
దేశంలో నిన్న 34,457 కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,23,93,286కు చేరింది. అలాగే నిన్న క‌రోనా నుంచి 36,347 మంది కోలుకున్నారు. నిన్న 375 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మొత్తం 4,33,964కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,15,97,982 మంది కోలుకున్నారు.    

యాక్టివ్ కేసుల సంఖ్య 151 రోజుల క‌నిష్ఠ‌ స్థాయికి చేరుకుంది. 3,61,340 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. అలాగే, దేశంలో నిన్న 36,36,043 వ్యాక్సిన్ డోసులు వేయగా, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 57,61,17,350 డోసుల వ్యాక్సిన్లు వేసినట్టు అధికారులు ప్ర‌క‌టించారు. ఇక‌, నిన్న దేశంలో మొత్తం 17,21,205 కరోనా ప‌రీక్ష‌లు నిర్వహించారు.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News