'కొండ పొలం' నుంచి వైష్ణవ్ తేజ్ ఫస్టులుక్!

Kondapolam movie first look released
షార్ట్స్‌లో చూడండి
ఇటీవల కాలంలో స్టార్ డైరెక్టర్లు భారీ ప్రాజెక్టులను ఎక్కువగా ఒప్పుకుంటున్నారు. అయితే అవి షూటింగు పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలా సమయమే పడుతుంది. ఈ లోగా ప్రేక్షకులతో గ్యాప్ వచ్చేస్తోంది. అందువలన సినిమాకి సినిమాకి మధ్య ఏ మాత్రం గ్యాప్ దొరికినా వెంటనే వాళ్లు ఒక చిన్న సినిమాను చేస్తున్నారు.

అలా దర్శకుడు క్రిష్ 'కొండ పొలం' అనే ఒక సినిమాను చేశారు. వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా ఆయన ఈ సినిమాను రూపొందించారు. కేవలం 40 రోజుల్లో ఆయన ఈ సినిమాను పూర్తిచేశారట. రకుల్ ప్రీత్ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమా, చాలా రోజుల క్రితమే పూర్తయినా సరైన విడుదల తేదీ కోసం ఎదురుచూస్తోంది.

రాజీవ్ రెడ్డి - సాయిబాబు నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. తాజాగా ఈ సినిమాకి 'కొండ పొలం' అనే టైటిల్ ను ఖరారు చేశారు. అలాగే ఈ సినిమాను అక్టోబర్ 8వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు.

Go Back to Shorts
Panja Vaisshnav Tej
Rakul Preet Singh
Krish

More Telugu News