గుంటూరులో కలకలం.. బీటెక్ అమ్మాయిని కత్తితో పొడిచి చంపిన యువకుడు
- గుంటూరు కాకాని రోడ్డులో బీటెక్ విద్యార్థిని హత్య
- మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
- ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ మూడో ఏడాది చదువుతోన్న యువతి
స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ కాలేజీలో ఆ అమ్మాయి బీటెక్ మూడో ఏడాది చదువుతున్నట్లు గుర్తించారు. యువతిని ఆ యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తుండగా, ఆమె తిరస్కరించడంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.