దేశంలో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌

15-08-2021 Sun 09:52
  • నిన్న 36,083 క‌రోనా కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య  3,21,92,576
  • నిన్న 493 మంది మృతి
  • మృతుల సంఖ్య మొత్తం 4,31,225
Media Bulletin on status of positive cases COVID19 in india
భార‌త్‌లో నిన్న 36,083 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,21,92,576కు చేరింది. అలాగే నిన్న క‌రోనా నుంచి  37,927 మంది కోలుకున్నారు.
 
ఇక మరణాల విషయానికొస్తే... నిన్న 493 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,31,225 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,13,76,015 మంది కోలుకున్నారు. 3,85,336 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. అలాగే, నిన్న 73,50,553 వ్యాక్సిన్ డోసులు, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 54,38,46,290 డోసులు వేసినట్టు అధికారులు ప్ర‌క‌టించారు.