భార‌త్‌లో క‌రోనా కేసుల తాజా వివ‌రాలు

14-08-2021 Sat 09:56
  • నిన్న 38,667 క‌రోనా కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,21,56,493
  • నిన్న 478 మంది క‌రోనాతో మృతి
  • మృతుల సంఖ్య మొత్తం 4,30,732
Media Bulletin on status of positive cases COVID19 in india
భార‌త్‌లో నిన్న 38,667 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,21,56,493కు చేరింది. అలాగే నిన్న క‌రోనా నుంచి 35,743 మంది కోలుకున్నారు.
 
ఇక మరణాల విషయానికొస్తే... నిన్న 478 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,30,732కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,13,38,088 మంది కోలుకున్నారు. 3,87,673 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. అలాగే, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 53.61
కోట్ల‌ వ్యాక్సిన్ డోసులు వేసినట్టు అధికారులు ప్ర‌క‌టించారు.