Corona Virus: దేశంలో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌

  • నిన్న 39,070 క‌రోనా కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య  3,19,34,455
  •  నిన్న 491 మంది మృతి
  • మృతుల సంఖ్య మొత్తం 4,27,862
Media Bulletin on status of positive cases COVID19 in india

దేశంలో నిన్న  39,070 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అలాగే, 24 గంట‌ల్లో 43,910 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  3,19,34,455కు చేరింది.

ఇక మరణాల విషయానికొస్తే... నిన్న  491 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,27,862కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు  3,10,99,771 మంది కోలుకున్నారు. 4,06,822 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. నిన్న 55,91,657 వ్యాక్సిన్ డోసులు వేయగా, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 50,68,10,492  వ్యాక్సిన్ డోసులు వేసినట్టు అధికారులు ప్ర‌క‌టించారు.

More Telugu News