Janasena: జనసేన చేనేత వికాస విభాగం కార్యవర్గం నియామకం

  • చేనేత రంగం ఎదుర్కొంటోన్న స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్క‌రాల కోసం నియామ‌కం
  • 20 మందితో విభాగం ఏర్పాటు
  • ప్ర‌తి కార్మికుడిని ఆదుకోవ‌డానికి  క‌మిటీ కృషి  
janasena appoints cheneta committee

చేనేత దినోత్సవం సంద‌ర్భంగా జ‌న‌సేన చేనేత వికాస విభాగం కార్య‌వ‌ర్గాన్ని ఆ పార్టీ నియ‌మించింది. ఏపీలో చేనేత రంగం ఎదుర్కొంటోన్న స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారాలు అన్వేషించ‌డానికి, చేనేత క‌ళాకారుల‌కు అండ‌గా ఉండ‌డానికి 20 మందితో ఈ విభాగాన్ని ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపింది. చేనేత రంగంపై ఆధార‌ప‌డ్డ ప్ర‌తి కార్మికుడిని ఆదుకోవ‌డానికి ఈ క‌మిటీ కృషి చేస్తుంద‌ని జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయ కార్య‌ద‌ర్శి హ‌రిప్ర‌సాద్ పేరిట ఈ ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. ఈ క‌మిటీకి చైర్మ‌న్‌గా చిల్ల‌ప‌ల్లి శ్రీ‌నివాస‌రావు కొన‌సాగుతున్నారు.

  

More Telugu News