పుల్వామా దాడి కుట్రదారు, మసూద్ అజర్ మేనల్లుడు లంబూ కాల్చివేత
- రెండేళ్లుగా అతడి కోసం గాలిస్తున్న బలగాలు
- నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో లంబూ సహా మరో ఉగ్రవాది హతం
- పుల్వామా దాడి నిందితుల్లో ఇప్పటి వరకు 9 మంది కాల్చివేత
2019లో పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్ల కాన్వాయ్‌పై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడి కేసులో లంబూ ప్రధాన కుట్రదారుడు. అప్పటి నుంచి అతడి కోసం గాలిస్తున్న బలగాలు నిన్న విజయం సాధించాయి. ఇదే ఎన్‌కౌంటర్‌లో మరణించిన మరో ఉగ్రవాది సమీర్ దార్ కూడా పుల్వామా కేసులో నిందితుడే కావడం గమనార్హం. కాగా, పుల్వామా నిందితుల్లో ఇప్పటి వరకు 9 మందిని భద్రతా దళాలు హతమార్చాయి.