ధనుష్ తో జతకట్టనున్న పూజ హెగ్డే?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ధనుష్ తో జతకట్టనున్న పూజ హెగ్డే?

Pooja Hegde to pair up with Dhanush
  • తెలుగు, హిందీ ప్రాజక్టులతో పూజ బిజీ 
  • తెలుగులో ధనుష్ రెండు ప్రాజక్టులు
  • రెండో ప్రాజక్టులో నాయికగా పూజ
  • సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాణం
వరుస విజయాలతో దూసుకుపోతున్న కథానాయిక పూజ హెగ్డే ఇప్పుడు తెలుగుతో పాటు హిందీలోనూ బిజీగా వుంది. భారీ పారితోషికాన్ని అందుకుంటూ అగ్రతారగా రాణిస్తోంది. ఇప్పటికే తెలుగులో ఆమె నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్', 'రాధేశ్యామ్' సినిమాలు విడుదలకు రెడీ అవుతుండగా.. మరోపక్క 'ఆచార్య'లో చరణ్ సరసన నటిస్తోంది. మరోపక్క హిందీలో 'సర్కస్', 'బీస్ట్', 'భైజాన్' చిత్రాలలో నటిస్తోంది. ఈ క్రమంలో తమిళ కథానాయకుడు ధనుష్ సరసన నటించే ఛాన్స్ పూజకు వచ్చిందట.

ఇప్పటికే పలు అనువాద చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన ధనుష్ ఇప్పుడు తెలుగులో రెండు స్ట్రెయిట్ సినిమాలు చేయడానికి అంగీకరించాడు. వీటిలో మొదటి చిత్రానికి శేఖర్ కమ్ముల, రెండో చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తారు. ఇప్పుడీ రెండో చిత్రంలో కథానాయికగా పూజ హెగ్డే నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయంపై ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారట. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తుంది.
Pooja Hegde
Dhanush
Venky Atluri
Shekhar Kammula

More Telugu News