కర్ణాటక ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై ప్రమాణ స్వీకారం
- బొమ్మైతో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ గహ్లోత్
- పాల్గొన్న యడియూరప్ప
- ఉపముఖ్యమంత్రులుగా ఆర్.అశోక్, బి.శ్రీరాములు, గోవింద
ఇంతకు ముందు వరకు హోంమంత్రిగా బసవరాజ్ బొమ్మై కొనసాగారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మై కుమారుడు. అంతేగాక, యడియూరప్పకు అత్యంత సన్నిహితుడిగా పేరుతెచ్చుకున్నారు. కాగా, కర్ణాటకకు ముగ్గురు ఉపముఖ్యమంత్రులను నియమించారు. ఆర్.అశోక్, బి.శ్రీరాములు, గోవింద కారజోళ ఆ పదవులను చేపట్టనున్నారు.