RRR: సిద్ధంగా ఉండండి అంటూ రాజ‌మౌళి 'ఆర్ఆర్ఆర్' సినిమా నుంచి అప్‌డేట్!

  • రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ పేరిట మేకింగ్ వీడియో
  • ఈ నెల 15న విడుద‌ల
  • శ‌ర‌వేగంగా షూటింగ్ పూర్తి
rrr update

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటోన్న 'ఆర్ఆర్ఆర్' సినిమా నుంచి మ‌రో అప్ డేట్ వెలువడింది. రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ పేరిట ఈ సినిమా మేకింగ్ వీడియోను ఈ నెల 15న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఆ సినిమా యూనిట్ ప్ర‌క‌టించింది. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్‌ను విడుద‌ల చేసింది.

ఈ సినిమాలో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే వారి పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసి ఆ సినిమా యూనిట్ ఆక‌ర్షించింది. వారిద్దరు ఒకే బైక్‌పై వెళ్తోన్న ఆ పోస్ట‌ర్ ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంది. ఈ సినిమాకు సంబంధించిన అన్ని ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

రెండు పాట‌లు మిన‌హా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్త‌యింద‌ని ఇటీవ‌లే సినిమా యూనిట్ వివ‌రించింది. బాహుబలి సినిమాల త‌ర్వాత‌ రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమా దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోంది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్ కూడా నటిస్తున్నారు.

More Telugu News