Anasuya: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • 'పుష్ప' షూటింగులో అనసూయ
  • టీవీ షో కోసం ఎన్టీఆర్ షూటింగ్  
  • తేజ చిత్రానికి మ్యూజిక్ సిటింగ్స్  
Anasuya joins Pushpa shoot

*  అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో రూపొందుతున్న 'పుష్ప' చిత్రం పార్ట్-1 చివరి షెడ్యూలు షూటింగ్ గత కొన్ని రోజులుగా హైదరాబాదులో కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న యాంకర్ అనసూయ నిన్న ఈ చిత్రం షూటింగులో జాయిన్ అయింది.
*  కథానాయకుడు ఎన్టీఆర్ తాజాగా జెమిని టీవీ కోసం 'ఎవరు మీలో  కోటీశ్వరులు' క్విజ్ షోని హోస్ట్ చేయనున్న విషయం విదితమే. ఈ షోకు సంబంధించిన ఎపిసోడ్ల చిత్రీకరణలో ఎన్టీఆర్ పాల్గొంటున్నాడు. ప్రస్తుతం పదిరోజుల పాటు ఈ షోకి షూటింగ్ చేయడానికి ఆయన డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.  
*  ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిటింగ్స్ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ నేతృత్వంలో జరుగుతున్నాయి. ఈ చిత్రానికి ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ పాటలు రాస్తున్నారు. ఇక వచ్చే నెల నుంచి ఈ చిత్రం షూటింగ్ మధ్యప్రదేశ్ లోని పలు లొకేషన్లలో జరుగుతుంది.

More Telugu News