థియేటర్లకే వస్తానంటున్న 'గల్లీ రౌడీ'
- సందీప్ కిషన్ నుంచి 'గల్లీ రౌడీ'
- కథానాయికగా నేహా శెట్టి పరిచయం
- త్వరలోనే భారీ స్థాయి విడుదల
- వెయిట్ చేయమంటున్న హీరో
ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది. దాదాపు ఈ సినిమా ఓటీటీలో రావొచ్చనే టాక్ వచ్చింది. కానీ 'ఇది థియేటర్లో చూడవలసిన సినిమా' అంటూ సందీప్ కిషన్, ఈ సినిమా థియేటర్లలోనే వస్తుందనే విషయాన్ని స్పష్టం చేశాడు. విడుదల తేదీ కోసం వెయిట్ చేయమని అన్నాడు. ఇది ఫన్ తో కూడిన మాస్ మసాలా మూవీ అని చెప్పాడు. ఈ సినిమాతో తెలుగు తెరకి కథానాయికగా 'నేహా శెట్టి' పరిచయమవుతోంది. జి. నాగేశ్వరరెడ్డి - సందీప్ కిషన్ కాంబినేషన్ లో రూపొందిన ఈ సినిమా, థియేటర్లో ఎంతలా నవ్వులు పూయిస్తుందో .. మాస్ ఆడియన్స్ ను ఎంతలా మెప్పిస్తుందో చూడాలి.