AP BJP: వివిధ విభాగాలకు రాష్ట్ర కమిటీలు ప్రకటించిన ఏపీ బీజేపీ

AP BJP announces state committees
షార్ట్స్‌లో చూడండి
ఏపీ బీజేపీ క్షేత్రస్థాయి నుంచి బలోపేతానికి చర్యలు తీసుకుంటోంది. వివిధ విభాగాలకు సంబంధించి రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలకు బీజేపీ హైకమాండ్ ఆమోదం తెలిపింది. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఓ ప్రకటనలో కమిటీల వివరాలు వెల్లడించారు. దీనిపై ట్విట్టర్ లో స్పందించిన ఆయన, ఆయా కమిటీలు, సభ్యుల జాబితాలను పంచుకున్నారు. ఈ కమిటీల్లో అవకాశం లభించిన కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. కమిటీ సభ్యులందరూ వారి బాధ్యతలకు తగిన న్యాయం చేస్తారని, పార్టీ అభివృద్ధికి తమవంతు కృషి చేస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు.
Go Back to Shorts
AP BJP
Committees
State
All Wings

More Telugu News