నువ్వు ఇప్పటికీ 21 ఏళ్ల కుర్రాడిలా ఉన్నావు: హృతిక్ కు మాజీ భార్య సుసానే ప్రశంస
- ఇన్స్టాలో తన పిక్ ను పోస్ట్ చేసిన హృతిక్
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో
- ప్రశంసలు కురిపించిన అనిల్ కపూర్
తాజాగా హృతిక్ ఒక ఫొటోను ఇన్స్టాలో షేర్ చేశారు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పిక్ పై ఆయన మాజీ భార్య సుసానే ఖాన్ కూడా స్పందించింది. నువ్వు ఇప్పటికీ 21 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తున్నావని సుసానే కితాబునిచ్చింది. అనిల్ కపూర్ కూడా షర్ట్ లేకుండా ఉన్న హృతిక్ పిక్ పై స్పందించాడు. రోజురోజుకీ నీ శరీర సౌష్టవం పెరుగుతోందని ప్రశంసించాడు.