RRR: ఒకే బైక్‌పై వెళ్తున్న కొమురం భీమ్‌, అల్లూరి.. 'ఆర్ఆర్ఆర్' నుంచి ఆస‌క్తిక‌ర పోస్టర్ విడుద‌ల‌

 NTR Ramcharan have completed the dubbing for 2 languages and will wind up the rest soon
షార్ట్స్‌లో చూడండి
రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటోన్న ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి కీలక అప్ డేట్ వెలువడింది. ఈ సినిమాలో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. వారిద్దరు ఒకే బైక్‌పై వెళ్తోన్న ఓ ఫొటోను ఆ సినిమా బృందం విడుద‌ల చేసింది. చిరున‌వ్వులు చిందిస్తూ వారిద్ద‌రు ఉన్న ఈ పోస్ట‌ర్ అభిమానుల్లో ఆస‌క్తిరేపుతోంది.

ఈ సినిమాకు సంబంధించిన అన్ని ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయ‌ని ఆర్ఆర్ఆర్ బృందం తెలిపింది. రెండు పాట‌లు మిన‌హా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్త‌యింద‌ని వివ‌రించింది. రెండు భాష‌ల్లోనూ తారక్, చెర్రీ డ‌బ్బింగ్ చెప్పార‌ని, మిగ‌తా భాష‌ల్లోనూ త్వ‌ర‌లోనే డ‌బ్బింగ్ చెప్పే ప‌నులు పూర్తి చేస్తార‌ని తెలిపింది.  

కాగా, ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ను ఒక్కొక్క‌టిగా వదులుతూ రాజ‌మౌళి ప్రేక్ష‌కుల్లో అంచ‌నాల‌ను మ‌రింత పెంచుతున్నారు. బాహుబలి సినిమాల త‌ర్వాత‌ రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమా దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోంది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్ నటిస్తున్నారు.
Go Back to Shorts
RRR
Ramcharan
Junior NTR

More Telugu News