'మా' ఎన్నిక‌ల వేళ సినీన‌టుడు బ్ర‌హ్మాజీ జోక్‌!

brahmaji tweet about maa elections
  • మా ఎన్నికల‌పై చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ తో చ‌ర్చ‌లంటూ సెటైర్లు
  • జిన్ పింగ్‌ ఫొటోను వాడిన బ్ర‌హ్మాజీ
  • ఇది మ‌ర్యాద‌పూర్వ‌క భేటీయేనంటూ చుర‌క‌
  • జిన్ పింగ్ ప‌లు సలహాలు ఇచ్చాడని వ్యాఖ్య‌
మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు ర‌స‌వ‌త్త‌రంగా మారిన విష‌యం తెలిసిందే. మా అధ్యక్ష ప‌ద‌వి కోసం హీరో మంచు విష్ణు, సినీ నటులు ప్రకాశ్ రాజ్‌, జీవితా రాజశేఖర్‌, హేమ పోటీ ప‌డుతుండ‌డం, ఎవరికి వారు రకరకాల వ్యాఖ్య‌లు చేస్తుండ‌డంతో అంద‌రి దృష్టి వారిపై ప‌డింది. దీనిపై సినీన‌టుడు బ్ర‌హ్మాజీ త‌న‌దైన శైలిలో స్పందిస్తూ ఓ జోక్ వేశాడు. ఇందుకోసం చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ఫొటోను వాడ‌డం గ‌మ‌నార్హం.

ఈ ఎడిటింగ్‌ ఫొటోలో నటుడు బ్రహ్మాజీకి జిన్ పింగ్ షేక్‌హ్యాండ్‌ ఇవ్వాల‌ని చూడ‌డం, అందుకు బ్ర‌హ్మాజీ భార‌తీయ సంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో న‌మ‌స్కారం పెట్ట‌డం చూడొచ్చు. ‘ఇది మ‌ర్యాద‌పూర్వ‌క భేటీయే.. ఇందులో ఎటువంటి రాజకీయాలు లేవు. అయితే, మా ఎన్నికల గురించి మాత్రం చర్చలు జ‌రిపాం. జిన్ పింగ్ ప‌లు సలహాలు ఇచ్చాడు’ అని బ్ర‌హ్మాజీ చమత్కరించాడు.
brahmaji
Tollywood
China
jin ping

More Telugu News