Alia Bhat: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • 'ఆర్ఆర్ఆర్' షూటింగుకి అలియా భట్ 
  • రవితేజ సినిమా కోసం ప్రత్యేకమైన సెట్స్    
  • వరుణ్ సందేశ్ హీరోగా 'ఇందువదన'
Alia Joining RRR in first week of July

*  రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం షూటింగులో బాలీవుడ్ భామ అలియా భట్ జులై మొదటి వారంలో పాల్గొననుంది. ప్రస్తుతం తను హిందీలో చేస్తున్న 'గంగూభాయ్ కతియావాడి' చిత్రం షూటింగును నిన్ననే పూర్తిచేసింది. దీంతో ఇక 'ఆర్ఆర్ఆర్'లో జాయిన్ అవడానికి సిద్ధమవుతోంది.
*  'ఖిలాడి' తరువాత రవితేజ తన తదుపరి చిత్రాన్ని శరత్ మండవ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగును జులై ఒకటి నుంచి నిర్వహిస్తారు. ఇందుకోసం హైదరాబాదు గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకమైన సెట్స్ కూడా వేశారు.  
*  చాలా కాలం గ్యాప్ తర్వాత హీరో వరుణ్ సందేశ్ ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఎం.ఎస్.ఆర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పేరు 'ఇందువదన'. ఇప్పటికే షూటింగును పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రంలో ఫర్నాజ్ శెట్టి కథానాయికగా నటిస్తోంది.

More Telugu News