కత్తి మహేశ్ పరిస్థితి విషమం... మెరుగైన చికిత్స కోసం చెన్నై తరలింపు

Doctors says Kathi Mahesh health condition critical
  • ఈ ఉదయం నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం
  • తీవ్రంగా గాయపడిన కత్తి మహేశ్
  • నెల్లూరు మెడికవర్ ఆసుపత్రికి తరలింపు
  • తలకు, కంటికి బలమైన గాయాలు తగిలాయన్న వైద్యులు
ప్రముఖ సినీ సమీక్షకుడు, నటుడు కత్తి మహేశ్ పరిస్థితి విషమంగా ఉందని నెల్లూరు మెడికవర్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. కత్తి మహేశ్ ఈ ఉదయం నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయపడిన ఆయనను నెల్లూరు మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. ఆయన తాజా పరిస్థితిపై వైద్యులు వివరాలు తెలిపారు. కత్తి మహేశ్ తలకు, కంటికి బలమైన గాయాలు తగిలాయని వివరించారు. మెరుగైన చికిత్స కోసం ఆయనను చెన్నైకి తరలిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఉదయం జాతీయ హైవేపై కత్తి మహేశ్ ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనం ముందు వెళుతున్న లారీని బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
Go Back to Shorts
Kathi Mahesh
Critical
Road Accident
Nellore District
Chennai

More Telugu News