తొందరపడుతున్న ఎన్టీఆర్!
- ముగింపు దశలో 'ఆర్ ఆర్ ఆర్'
- రెడీగా ఉన్న టీవీ షో
- ఆగస్టు నుంచి కొరటాల సినిమా
అయితే ఆ టీవీ ఛానల్ వారు ఇప్పుడు చకచకా సన్నాహాలు చేసేస్తున్నారు. సాధ్యమైనంత త్వరలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలనే ఉద్దేశంతో ఉన్నారు. దాంతో 'ఆర్ ఆర్ ఆర్'లో తన పోర్షన్ ను త్వరగా ముగించాలనే ఆలోచనలో ఎన్టీఆర్ ఉన్నాడట. వచ్చేనెలలో 'ఆర్ ఆర్ ఆర్' ప్రాజెక్టు నుంచి బయటికి వచ్చేస్తే, ఆ వెంటనే టీవీ షోకి వెళ్లిపోవచ్చని భావిస్తున్నాడట. ఇక కొరటాల సినిమా కూడా ఆగస్టు నుంచి మొదలుకానున్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఎన్టీఆర్ ఫుల్ బిజీ అన్నమాట.