Charan: 'ఆర్ఆర్ఆర్' సెట్లోకి అడుగుపెట్టిన చరణ్!

  • భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా
  • యాక్షన్ సన్నివేశాలు హైలైట్
  • కరోనా కారణంగా ఆగిన షూటింగ్
  • మళ్లీ ఇప్పుడు సెట్స్ పైకి వెళ్లిన చరణ్  
Ram Charan begins shoot for RRR Movie

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆర్ ఆర్ ఆర్' చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. అయితే కరోనా కారణంగా అప్పుడప్పుడు షూటింగుకు అంతరాయం ఏర్పడుతూనే ఉంది. ఆలస్యానికి కరోనా కూడా ఒక కారణమవుతూ వస్తోంది. సెకండ్ వేవ్ వలన ఈ సినిమా షూటింగు ఆగిపోయింది. ఇప్పుడు కరోనా తీవ్రత కాస్త తగ్గడంతో మళ్లీ షూటింగును మొదలుపెట్టారు. చాలా రోజుల తరువాత మళ్లీ సెట్లోకి చరణ్ అడుగుపెట్టాడు. ఈ రోజు నుంచి చరణ్ పోర్షన్ కి సంబంధించిన కొన్ని సీన్స్ ను చిత్రీకరించనున్నారు.

ముంబైకి చెందిన ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్ ఆలీమ్ హకీమ్ కూడా, చరణ్ తో పాటు సెట్స్ కి వచ్చాడు. ఈ సందర్భంగా దిగిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తున్న ఈ సినిమాలో, కొమరమ్ భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నాడు. యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ఇటు చరణ్ ఫ్యాన్స్ .. అటు ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కీరవాణి సంగీతం ఈ సినిమాకి  ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

More Telugu News