చిత్తూరు యాసలో సందడి చేయనున్న రవితేజ!
- విడుదలకి సిద్ధమవుతున్న 'ఖిలాడి'
- శరత్ మండవకు దర్శకుడిగా ఛాన్స్
- పాతికేళ్ల క్రితం జరిగే కథ
- కథానాయికగా 'దివ్యాన్ష కౌశిక్'
శరత్ మండవ ఈ సినిమాతోనే దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా కోసం ఆయన ఎంచుకున్న కథ చాలా కొత్తగా ఉందట. పాతికేళ్ల క్రితం జరిగే కథ ఇది. అప్పటి పరిస్థితుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. రవితేజ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు. ఇక ఆయన చిత్తూరు యాసలో మాట్లాడతాడనే విషయం తాజాగా బయటికి వచ్చింది. ఈ డైలాగ్ డెలివరీతో ఆయన ఎలా చెలరేగిపోతాడో చూడాలి. వినోదభరితమైన ఈ సినిమాలో కథానాయికగా 'దివ్యాన్ష కౌశిక్'ను తీసుకున్నారు. సామ్ సీఎస్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని అంటున్నారు.