L Ramana: కారెక్కేందుకు సిద్ధమైన టీటీడీపీ చీఫ్ ఎల్.రమణ.. సన్నిహితులు, నాయకులతో సుదీర్ఘ చర్చ

  • పార్టీ మారేందుకు మానసికంగా సిద్ధమైన టీటీడీపీ నేత 
  • నేడు జగిత్యాలలో విలేకరుల సమావేశం
  • భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్న రమణ
TTDP Chief L Ramana Ready to join in TRS

తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఆయన పార్టీ మారబోతున్నారన్న ప్రచారం చాలా రోజులుగా జరుగుతూనే ఉంది. ఈ ఊహాగానాలు నిజమనిపించేలా నిన్న జగిత్యాలలోని తన కార్యాలయంలో సన్నిహితులు నాయకులతో సుదీర్ఘంగా చర్చించారు.

వారిలో చాలామంది టీఆర్ఎస్‌లో చేరాలన్న నిర్ణయాన్ని సమర్థించినట్టు తెలుస్తోంది. పార్టీ మారాలన్న నిర్ణయానికి ఇది వరకే వచ్చిన రమణ.. నిన్నటి సమావేశంలో అందరూ ఆ నిర్ణయాన్ని సమర్థించడంతో పార్టీ మార్పునకు మానసికంగా సిద్ధమైనట్టు తెలుస్తోంది. నేడు జగిత్యాలలో విలేకరుల సమావేశం నిర్వహించి తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

More Telugu News