Allu Arjun: 'పుష్ప'కు ఉన్న క్రేజ్ అలాంటిది మరి!

Highest craze for Pushpa movie in overseas
షార్ట్స్‌లో చూడండి
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. తొలి భాగానికి సంబంధించిన షూటింగు కొంతవరకే మిగిలిఉంది. కరోనా ప్రభావం తగ్గగానే చకచకా షూటింగును పూర్తిచేయాలనే ప్లానింగుతోనే ఉన్నారు. అంతా అనుకున్నట్టుగా జరిగితే దసరాకి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా బిజినెస్ గురించిన వార్త జోరుగా షికారు చేస్తోంది. ఈ సినిమా ఓవర్సీస్ బిజినెస్ డీల్ పూర్తయిందని అంటున్నారు. ఓవర్సీస్ కి సంబంధించి అల్లు అర్జున్ కెరియర్లోనే అత్యధిక ధరకి అమ్ముడైన సినిమా ఇదేనని చెబుతున్నారు. అల్లు అర్జున్ లుక్ నుంచి ప్రతి అంశం క్రేజ్ ను పెంచుతూ వెళ్లడమే ఇందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, ఫహాద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు.
Go Back to Shorts
Allu Arjun

More Telugu News