తెలంగాణలో 18 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్... సర్కారు ఆమోదం
- ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతి
- ఆఫీసులు, కంపెనీలు, గేటెడ్ కమ్యూనిటీల్లోనూ వ్యాక్సిన్
- దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్
- అనేక రాష్ట్రాల్లో టీకాల కొరత
- 45 ఏళ్లకు పైబడినవారికే చాలాచోట్ల ప్రాధాన్యత
దేశంలో 45 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా, 18 నుంచి 44 ఏళ్ల లోపు వారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వొచ్చని కేంద్రం ప్రకటించింది. అయితే టీకాల కొరతతో చాలా రాష్ట్రాలు 18 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇంకా 45 ఏళ్లకు పైబడినవారికి రెండో డోస్ ఇచ్చే కార్యక్రమాలే కొనసాగుతున్నాయి.