తెలంగాణలో నెమ్మదిస్తున్న కరోనా వ్యాప్తి
- గత 24 గంటల్లో 65,997 కరోనా పరీక్షలు
- 3,464 పాజిటివ్ కేసులు
- జీహెచ్ఎంసీ పరిధిలో 534 మందికి కరోనా
- కరోనా నుంచి కోలుకున్న 4,801 మంది
- ఇంకా 44,395 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటివరకు 5,47,727 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,00,247 మంది కోలుకున్నారు. ఇంకా 44,395 మందికి చికిత్స జరుగుతోంది. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 91.33 శాతంగా నమోదైంది. జాతీయస్థాయి రికవరీ రేటు 87.2 శాతం అని తాజా బులెటిన్ లో పేర్కొన్నారు.