RRR: ఆయుధాన్ని గురిపెట్టి నీళ్ల‌లోంచి దూసుకొస్తోన్న జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. 'ఆర్ఆర్ఆర్' నుంచి మ‌రో లుక్ విడుద‌ల‌

  • కొమురం భీమ్ గా ఎన్టీఆర్
  • ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా లుక్ విడుద‌ల‌
  • భీమ్‌కు బంగారం లాంటి మ‌న‌సు ఉంటుంద‌న్న రాజ‌మౌళి
  • తిరుగుబాటు మొద‌లు పెట్టాడంటే ఎంతో ధైర్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తాడ‌ని డైలాగ్   
 Komram Bheem intense look from RRR

ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి రూపొందిస్తోన్న భారీ బ‌డ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్ నుంచి ఎన్టీఆర్‌కు సంబంధించిన మ‌రో లుక్ విడుద‌లైంది. ఆయుధాన్ని గురిపెట్టి నీళ్ల‌లోంచి దూసుకొస్తోన్న ఎన్టీఆర్ పోజు అలరిస్తోంది. ఈ సినిమాలో కొమురం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ రోజు ఎన్టీఆర్ పుట్టిన‌రోజును పురస్కరించుకుని ఈ లుక్‌ను ఆ సినిమా బృందం విడుద‌ల చేసింది. భీమ్‌కు బంగారం లాంటి మ‌న‌సు ఉంటుంద‌ని, అయితే, తిరుగుబాటు మొద‌లు పెట్టాడంటే ఎంతో ధైర్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తాడ‌ని రాజ‌మౌళి పేర్కొన్నారు.

కాగా, బాహుబలి సినిమాల త‌ర్వాత‌ రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమాలో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ను ఒక్కొక్క‌టిగా వదులుతూ రాజ‌మౌళి ప్రేక్ష‌కుల్లో అంచ‌నాల‌ను మ‌రింత పెంచుతున్నారు.

ఈ ఏడాది అక్టోబర్ 13వ తేదీన ఈ సినిమా విడుద‌ల కానున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న వ‌చ్చిన‌ప్ప‌టికీ క‌రోనా మ‌ళ్లీ విజృంభిస్తుండ‌డంతో వాయిదా పడే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమా దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోంది.

More Telugu News