Andhra Pradesh: ఉత్తర కోస్తాంధ్రలో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు

  • యానాంలోనూ వర్షాలు కురిసే అవకాశం
  • దక్షిణ కోస్తాంధ్రలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు
  • వెల్లడించిన అమరావతి వాతావరణ కేంద్రం
Rains in Andhrapradesh today and tomorrow

ఆంధ్రప్రదేశ్‌లో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంధ్రతోపాటు యానాంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, దక్షిణ కోస్తాంధ్రలో గంటకు దాదాపు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వివరించింది. రాయలసీమ జిల్లాల్లోనూ ఇలాంటి పరిస్థిితే ఉంటుందని అధికారులు తెలిపారు.

More Telugu News