అఖిల్ కోసం కొరటాలను లైన్లో పెట్టిన నాగ్!
- హిట్ కోసం అఖిల్ వెయిటింగ్
- సురేందర్ రెడ్డితో కొత్త ప్రాజెక్టు
- 'ఏజెంట్' టైటిల్ ఖరారైనట్టే
- తదుపరి సినిమా కొరటాలతో
ఆ తరువాత అఖిల్ సినిమా కొరటాల దర్శకత్వంలో ఉండనుందనే టాక్ తాజాగా షికారు చేస్తోంది. కొరటాల ఎంచుకునే కథలు .. ఆయన ట్రీట్మెంట్ కొత్తగా ఉంటాయి. పైగా ఇంతవరకూ ఆయనకు ఫ్లాప్ ఎలా ఉంటుందనేది తెలియదు. అందువలన ఆయనను నాగార్జున సంప్రదించినట్టుగా తెలుస్తోంది. అఖిల్ కోసం మంచి కథను రెడీ చేసి రంగంలోకి దిగమని అన్నట్టుగా చెప్పుకుంటున్నారు. 'ఆచార్య' తరువాత ఎన్టీఆర్ తో కొరటాల ఒక సినిమా చేయనున్నాడు. ఆ తరువాత సినిమా అఖిల్ తోనే ఉండనుందని అంటున్నారు. ఇది అక్కినేని అభిమానులకు సంతోషాన్ని కలిగించే విషయమే.