Balakrishna: ముగింపు దశకు చేరిన 'అఖండ'

  • బాలకృష్ణ నుంచి రానున్న 'అఖండ'
  • చివరిదశకు తీసుకొచ్చిన బోయపాటి
  • తమన్ సంగీతం ప్రత్యేక ఆకర్షణ
  • దసరాకి విడుదల చేసే ఆలోచన        
Akhanda shoot is in final stage

బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో 'అఖండ' సినిమా రూపొందుతోంది. టైటిల్ ను ప్రకటించిన దగ్గర నుంచి ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఫస్టు టీజర్ వదిలిన దగ్గర నుంచి అంచనాలు మరింత పెరుగుతున్నాయి.

ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఇంకా 15 నుంచి 20 రోజుల పాటు చిత్రీకరణ జరుపుకుంటే, షూటింగు పార్టు మొత్తం పూర్తవుతుందని అంటున్నారు. సాధ్యమైనంత త్వరలో ఆ కాస్త చిత్రీకరణను పూర్తిచేయాలనే ఆలోచనలో ఉన్నారట.

బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రలను పోషిస్తున్న ఈ సినిమాలో, కథానాయికగా ప్రగ్య జైస్వాల్ నటిస్తోంది. ఇక ఒక ముఖ్యమైన పాత్రలో పూర్ణ కనిపించనుంది. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. నిజానికి ఈ సినిమాను ఈ నెల 28వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ ఉద్దేశాన్ని విరమించుకున్నారు. దసరాకి ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారనే ప్రచారమైతే జోరుగా జరుగుతోంది.

More Telugu News