వారం రోజులుగా జాడలేని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు.. పలు అనుమానాలు!
- ఈటలతో సన్నిహిత సంబంధాలు
- ఆయనతో కలిసి వ్యాపార లావాదేవీలు
- గుర్రుగా ఉన్న కేసీఆర్
- పోలీసులకు ఫిర్యాదు చేయని కుటుంబ సభ్యులు
అలాగే, కాంగ్రెస్ నేత దుద్దిళ్ల శ్రీధర్‌బాబును టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించడంపై గుర్రుగా ఉండడం వల్లే మధు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు చెబుతున్నారు. ఇంకోవైపు, మధు వారం రోజులుగా కనిపించకున్నా ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, పుట్ట మధు ఎక్కడున్నారన్న విషయం పోలీసులకు, కుటుంబ సభ్యులకు తెలుసని ప్రచారం జరుగుతోంది. మధు వెంట గన్‌మన్లు ఉన్నారని రామగుండం పోలీస్ కమిషనర్ చెప్పడం ఈ అనుమానాలను బలపరుస్తోంది.