Allu Arjun: 'ఆర్య'కు 17 ఏళ్లు .. గుర్తుచేసుకున్న బన్నీ!

  • సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'ఆర్య'
  • బన్నీ క్రేజ్ ను పెంచిన మూవీ
  • ఆ సినిమాను మరిచిపోలేనన్న బన్నీ  

17 Years for Arya movie

అల్లు అర్జున్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో 'ఆర్య' ఒకటి. ఈ సినిమాతో అల్లు అర్జున్ కి యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోయింది. 'గంగోత్రి' సినిమాలో అమాయకంగా కనిపించిన బన్నీకి, 'ఆర్య'లో స్టైల్ గా అలరించిన బన్నీకి  అసలు సంబంధమే లేదని అనుకున్నారు. అలా బన్నీకి స్టార్ డమ్ తెచ్చి పెట్టిన సినిమా ఇదేనని చెప్పొచ్చు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, బన్నీని నిలబెట్టేసింది. అలాంటి ఈ సినిమా ఈ రోజుతో 17 ఏళ్లను పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా 'ఆర్య' సినిమాను బన్నీ గుర్తు చేసుకున్నాడు.

"నా జీవితంలో అతి పెద్ద మార్పు 'ఆర్య'తోనే జరిగింది. ఆ సినిమాను ఇప్పటికీ నేను ఒక అద్భుతంగానే భావిస్తూ ఉంటాను.  'ఫీల్ మై లవ్ .. ' అని నేను చెప్పిన దగ్గర నుంచి ప్రేక్షకులు నన్ను ప్రేమిస్తూనే వస్తున్నారు. నాతో పాటు ఈ సినిమాకి పని చేసిన వాళ్లందరి జీవితాలు మారిపోయాయి. సుకుమార్ .. దిల్ రాజు .. దేవిశ్రీ ప్రసాద్ .. రత్నవేలు .. బన్నీ వాసు .. ఇలా అందరూ ఒక స్థాయికి ఎదిగిపోయారు. అలా ఈ సినిమా అందరి జీవితాలను మార్చేసింది. అలాంటి ఈ సినిమాను .. ఆ సినిమా పట్ల ప్రేక్షకులు చూపిన ఆదరణను ఎప్పటికీ మరిచిపోలేము" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News