Balakrishna: మరోసారి ఫ్యాక్షనిస్టుగా కనిపించనున్న బాలయ్య!

Balakrishna is seen as a factionist in Gopichand Malineni movie
షార్ట్స్‌లో చూడండి
ఫ్యాక్షన్ సినిమాల జోరు సాగుతున్న సమయంలో చాలామంది హీరోలు అలాంటి నేపథ్యంలో సాగే సినిమాలనే చేస్తూ వెళ్లారు. కానీ వాళ్లలో బాలకృష్ణ ఎక్కువ మార్కులు కొట్టేశారు. ఫ్యాక్షన్ నేపథ్యంతో కూడిన సినిమాల్లో బాలకృష్ణ విజృంభించారు. ఆ సినిమాలు ఆయనకి భారీ విజయాలతో పాటు, రికార్డుస్థాయి వసూళ్లను కూడా తెచ్చిపెట్టాయి. అయితే ఇటీవల కాలంలో ఆయన ఈ జోనర్ లో సినిమా చేయలేదు. కానీ గోపీచంద్ మలినేని మూవీలో ఆయన ఫ్యాక్షనిజం మళ్లీ జూలు విదల్చనుందని అంటున్నారు.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినిమా చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణ డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తారట. అలా ఆయన కొంతసేపు ఫ్యాక్షన్ లీడర్ గా పవర్ఫుల్ రోల్ లో కనిపిస్తారని అంటున్నారు. ఈ పాత్రను ఆయన క్రేజ్ కి తగిన విధంగా గోపీచంద్ మలినేని డిజైన్ చేశాడని చెబుతున్నారు.

ఇక ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు అవకాశం ఉండగా, ఒక కథానాయికగా రాయ్ లక్ష్మీ ని తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, జూన్ 10వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Balakrishna
Gopichand Malineni
Tollywood

More Telugu News