Corona Virus: తెలంగాణలో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌!

  • కొత్త‌గా 6,026 మందికి కరోనా
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,75,748
  • మృతుల సంఖ్య 2,579
  • జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 1,115 మందికి క‌రోనా  
    Media Bulletin on status of positive cases COVID19 in Telangana

తెలంగాణలో మొన్న రాత్రి 8 గంట‌ల నుంచి నిన్న రాత్రి 8 గంటల మ‌ధ్య 6,026 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో 52 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 6,551 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,75,748కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,96,042 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 2,579గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 77,127 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 1,115 మందికి క‌రోనా సోకింది.  
 

More Telugu News