తెలంగాణ‌లో క‌రోనాతో ఒక్క‌రోజులో 58 మంది మృతి

29-04-2021 Thu 09:58
  • కొత్త‌గా 7,994 మందికి కరోనా
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,27,960
  • మృతుల సంఖ్య 2,208
  • జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 1,630 మందికి క‌రోనా
Media Bulletin on status of positive cases COVID19 in Telangana

తెలంగాణలో క‌రోనా కేసుల  ఉద్ధృతి కొన‌సాగుతోంది. మొన్న రాత్రి 8 గంట‌ల నుంచి నిన్న రాత్రి 8 గంటల మ‌ధ్య 7,994 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో 58 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 4,009 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,27,960కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,49,692 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 2,208గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 76,060 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 1,630 మందికి క‌రోనా సోకింది.