జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 1,005 మందికి క‌రోనా

23-04-2021 Fri 09:58
  • తెలంగాణలో కొత్త‌గా 6,206 మందికి కరోనా
  • ఒక్క‌రోజులో కరోనాతో 29 మంది మృతి
  • మృతుల సంఖ్య మొత్తం 1,928
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,79,494
Media Bulletin on status of positive cases COVID19 in Telangana

తెలంగాణలో మొన్న రాత్రి 8 గంట‌ల నుంచి నిన్న రాత్రి 8 గంటల మ‌ధ్య 6,206 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 3,052 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,79,494కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,24,840 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,928 గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 52,726 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 1,005 మందికి క‌రోనా సోకింది.