తెలంగాణ‌లో కొత్త‌గా 4,446 మందికి కరోనా

17-04-2021 Sat 10:02
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,331
  • కోలుకున్న వారు 3,11,008 మంది
  • మొత్తం మృతుల సంఖ్య 1,809
  • జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 598 కేసులు   
Media Bulletin on status of positive cases COVID19 in Telangana

తెలంగాణలో మొన్న రాత్రి 8 గంట‌ల నుంచి నిన్న రాత్రి 8 గంటల మ‌ధ్య 4,446 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 1,414 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,331కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,11,008 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,809గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 33,514 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 22,118 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 598 మందికి క‌రోనా సోకింది.