Junior NTR: అమాయక చక్రవర్తి పాత్రలో ఎన్టీఆర్?

  • కొరటాలతో ఎన్టీఆర్ సెకండ్ మూవీ
  • ఎన్టీఆర్ పాత్రపై అభిమానుల్లో ఆసక్తి
  • త్వరలోనే పూర్తి వివరాలు  
Ntr playing innocent character in koratala movie

ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ ఒక సినిమా చేయడమనేది ఖాయమైపోయింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇంతకుముందు 'జనతా గ్యారేజ్' వచ్చింది. ఈ సినిమాలో ఎంతటివాడినైనా ఎదుర్కునే పాత్రలో .. ఎదురులేని పాత్రలో ఎన్టీఆర్ కనిపించాడు. యాక్షన్ సీన్స్ లో చెలరేగిపోయాడు. అలాంటి ఎన్టీఆర్ ను తాజా సినిమాలో కొరటాల ఎలా చూపించనున్నాడనే ఆసక్తి సహజంగానే అభిమానుల్లో కలుగుతూ ఉంటుంది.  

ఈ నేపథ్యంలో.. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ అమాయక చక్రవర్తిగా కనిపించనున్నాడని అంటున్నారు. విలేజ్ లో అమాయకంగా తిరిగే ఈ పాత్ర ఒకానొక సందర్భంలో సిటీకి వెళ్లవలసి వస్తుందట. అక్కడ ఏం జరుగుతుంది? అప్పటి నుంచి ఆయన ఎలా మారతాడు? అనేది ఆసక్తికరంగా ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఇక కొరటాల గత చిత్రాల్లో మాదిరిగానే ఈ సినిమాలోను ఒక సందేశం ఉంటుందట. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.

More Telugu News