తెలంగాణ‌లో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌!

14-04-2021 Wed 09:50
  • కొత్త‌గా 2,157 మందికి కరోనా పాజిటివ్
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,34,738
  • మృతుల సంఖ్య 1,780
  • జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 361 మందికి క‌రోనా
 Media Bulletin on status of positive cases COVID19 in Telangana

తెలంగాణలో మొన్న రాత్రి 8 గంట‌ల నుంచి నిన్న రాత్రి 8 గంటల మ‌ధ్య 2,157 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 821 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,34,738కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,07,499 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,780గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 25,459 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 16,892 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 361 మందికి క‌రోనా సోకింది.