హైదరాబాదులో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం... పలు ప్రాంతాల్లో వర్షం
- గత కొన్నిరోజులుగా నగరంలో అధిక ఉష్ణోగ్రతలు
- ఉక్కపోత, వేడిమితో ఇబ్బందిపడుతున్న ప్రజలు
- ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ వర్షం
- పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయం
- రేపు కూడా వర్షం పడుతుందన్న వాతావరణ శాఖ
సాధారణంగా మార్చి, ఏప్రిల్ మాసాల్లో ఎండలు సాధారణ స్థాయిలోనే ఉంటాయి. అయితే, ఈసారి 40 డిగ్రీలను దాటి ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ప్రజలు ఉక్కపోత, అధిక వేడిమితో సతమతమవుతున్నారు. వారికి ఉపశమనం కలిగిస్తూ తాజాగా నగరంలో వర్షం కురిసింది. ఉపరితల ఆవర్తనం కారణంగానే ఈ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. రేపు కూడా జంటనగరాల్లో వర్షం పడే అవకాశం ఉందని వెల్లడించింది.